భోళా శంకర్ రిలీజ్ టైమ్ లో ఫిల్మ్ ఛాంబర్ లో ఓ కంప్లైంట్ నమోదు అయ్యిందని తెలుస్తోంది. అది విజయ్ దేవరకొండ....


సినిమా ఫీల్డ్ లో ఒక దానికొకటి లింక్ ఉంటూంటాయి. అవి చాలా సార్లు ప్లస్ అయ్యితే కొన్ని సార్లు కొత్త సమస్యలు తెచ్చిపెడుతూంటాయి. అదే విధంగా ఇప్పుడు చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ టైమ్ లో ఫిల్మ్ ఛాంబర్ లో ఓ కంప్లైంట్ నమోదు అయ్యిందని తెలుస్తోంది. అది విజయ్ దేవరకొండ పాత సినిమా ఫెయిల్యూర్ కు సంభందించిన సెటిల్మెంట్ అంటున్నారు. ఆ సినిమాకు భోళా శంకర్ సంభందం ఏమిటి..?

వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చిరంజీవి నుంచి రాబోతున్న సినిమా ఇది. భోళా శంక‌ర్ తో చిరంజీవి మ‌రో హిట్ కొట్టాల‌ని మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఈ సినిమాకు సంభందించిన కొన్ని ఇష్యూలు బయిటకువచ్చాయి. క్రియేటివ్ కమర్షియల్స్(కె.ఎస్.రామారావు) నిర్మించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాన్ని అభిషేక్ నామ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ లెక్కలను కె.ఎస్.రామారావు తాను అనిల్ సుంకరతో కలిసి నిర్మిస్తున్న 'భోళా శంకర్'తో సెట్ చేస్తానని చెప్పారట. నిజానికి 'భోళా శంకర్' చిత్రాన్ని ప్రకటించినప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ల పేర్లు పోస్టర్స్ పై కనిపించాయి. ఆ తర్వాత కొంతకాలానికి క్రియేటివ్ కమర్షియల్స్ పేరు లేదు.

అయితే కె.ఎస్.రామారావు కి సహకరించేలా కావాలనే క్రియేటివ్ కమర్షియల్స్ పేరుని ప్రమోషన్స్ లో లేకుండా చేశారనే భావనలో అభిషేక్ నామ ఉన్నారట. అందుకే 'భోళా శంకర్' విడుదలకు ముందే తన లెక్కలు సరిచేసేలా ఛాంబర్ కి ఫిర్యాదు చేస్తున్నారట. తనకు 'గూఢచారి' లెక్కలతో సమస్య లేదని, 'వరల్డ్ ఫేమస్ లవర్' లెక్కలే అసలు సమస్య ఆయన చెబుతున్నట్లు సమాచారం. 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా చేసారు. సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఇదంతా మీడియా ద్వారా తెలుస్తున్న విషయాలే. ఎంత వరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. 

ఇక మెగాస్టార్ చిరంజీవి మ‌రికొద్ది రోజుల్లో `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యాన‌ర్ల‌పై రామబ్రహ్మం సుంకర, కె.ఎస్.రామారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా(Tamannaah) హీరోయిన్ గా న‌టించింది. జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్‌, సుశాంత్‌, రఘు బాబు, మురళీ శర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

2015లో త‌మిళంలో అజిత్ న‌టించిన సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. అయితే రీమేక్‌ అయినప్పటికీ మెగాస్టార్ ఇమేజ్ కు తగట్టు భోళా శంక‌ర్(Bhola Shankar) లో చాలా మార్పులు చేశారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార‌కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ తో కూడా సినిమాకు మంచి హైప్ వ‌చ్చింది.