Asianet News TeluguAsianet News Telugu

వెబ్ సిరీస్..స్టార్ సినిమాని దెబ్బ కొట్టేసింది

వెబ్ సీరిస్ లు ఒక్కోసారి తమ సినిమాని దెబ్బకొట్టడం కూడా చాలా మందిని ఇబ్బందికే గురి చేస్తోంది. తాజాగా అభిషేక్ బచ్చన్ పరిస్దితి అదే. ఆయన తాజా చిత్రాన్ని ఓ వెబ్ సీరిస్ భారీగా దెబ్బకొట్టింది. 

Abhishek Bachchans The Big Bull fails to wow fans jsp
Author
Hyderabad, First Published Apr 12, 2021, 12:22 PM IST

సినిమాలకు పోటీ ఇస్తోంది ఓటీటి. అందులోనూ ముఖ్యంగా వెబ్ సీరిస్ లకు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. యూత్ ఎక్కువగా వెబ్ సీరిస్ లకే ప్రయారిటీ ఇస్తోంది. అందుకే కొందరు హీరోలు వెబ్ సీరిస్ లు చేయటానికి ధైర్యం చేస్తున్నారు. అయితే అదే సమయంలో వెబ్ సీరిస్ లు ఒక్కోసారి తమ సినిమాని దెబ్బకొట్టడం కూడా చాలా మందిని ఇబ్బందికే గురి చేస్తోంది. తాజాగా అభిషేక్ బచ్చన్ పరిస్దితి అదే. ఆయన తాజా చిత్రాన్ని ఓ వెబ్ సీరిస్ భారీగా దెబ్బకొట్టింది. 

వివరాల్లోకి వెళితే..అసలే అబిషేక్ కెరిర్ పరిస్దితి అంతంత మాత్రం. తన తండ్రి ఇప్పటికి బాలీవుడ్ స్క్రీన్ పై తన వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తూ దుమ్ము రేపుతూంటే తాను మాత్రం కెరీర్ లో వెనకే పడి ఉన్నాడు. అయితే ఆయన ఈ మధ్యకాలంలో ఓ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. తన కెరీర్ ని ఆ సినిమా ఎక్కడికో తీసుకెళ్తుందనుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు.. బిగ్ బుల్ .

అభిషేక్‌ బచ్చన్‌, ఇలియానా కలిసి నటించిన చిత్రం ‘ది బిగ్‌ బుల్‌’. కూకీ గులాటి దర్శకత్వంలో తెరకెక్కింది. 1980-1990 కాలంలో స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా పాల్పడిన ఆర్థిక నేరాల ఆధారంగా చిత్రం రూపొందించారు. చిత్రాన్ని ఏప్రిల్‌ 8న డిస్నీ + హాట్‌ స్టార్‌లో విడుదల చేసారు.  అజయ్‌ దేవగణ్‌ ఫిల్మ్స్, ఆనంద్‌ పండిట్‌ మోషన్‌ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.  ఇందులో నికితా దత్తా, వరుణ్‌ శర్మ, చుంకీ పాండే, లేఖ ప్రజాపతి, కుముద్‌ మిశ్రా తదితరులు నటిస్తున్నారు.

సెప్టెంబర్ 16, 2019న ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. దాంతో థియేటర్లో ఈ సినిమాని విడుదల చేయ లేదు. ఈ సినిమా కోసం అభిషేక్ చాలా కష్టపడ్డాడు. కానీ ఇదే కథతో వేరే వెబ్ సిరీస్ తెరకెక్కడం దీనికి సమస్య తెచ్చిపెట్టింది.  ‘స్కామ్ 1992’ పేరుతో హన్సల్ మెహతా.. హర్షద్ మెహతా కథను అద్భుత రీతిలో తెరకెక్కించటం సినిమాపై ఆసక్తి చంపేసింది. కొన్ని నెలల కిందట పెద్దగా ఎక్సపెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఆ సిరీస్ సంచలనాలు రేపింది. 

ఇండియన్ వెబ్ సిరీస్‌ల హిస్టరీలోనే ది బెస్ట్ అనిపించుకుంది. అప్పటికి షూటింగ్ పూర్తైనా...వెంటనే రిలీజ్ చేస్తే ‘స్కామ్ 1992’ ఎఫెక్ట్ పడుతుందని ఆపారు.  కానీ ఎంత లేటు చేసినా జనం స్కామ్ 1992 ని అంత తేలిగ్గా మర్చిపోయేలా లేరు. ఆ సీరిస్ తో పోల్చి చూసి ఈ సినిమా ప‌ట్ల పెద‌వి విరుస్తున్నారు ప్రేక్ష‌కులు. ముఖ్యంగా  స్కామ్ 1992లో ప్ర‌తీక్ గాంధీ ముందు అభిషేక్  తేలిపోయాడ‌ని, ఆయన కెరీర్లో దీన్ని మ‌రో ఫ్లాప్‌గానే పేర్కొంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios