మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడంటే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా అభిషేక్ నటించిన చిత్రాలు విజయవంతం కాలేదు. కానీ నటుడిగా మాత్రం మంచి ప్రయత్నం చేస్తున్నాడు. మల్టీస్టారర్ చిత్రాల్లో కూడా అభిషేక్ నటిస్తున్నాడు. 

ఇటీవల అభిషేక్ బచ్చన్ జోరు వెండితెరపై తగ్గింది. అభిషేక్ బచ్చన్ చివరగా మన్మర్జియాన్ చిత్రంలో నటించాడు. 2018లో ఈ చిత్రం విడుదలయింది. ఈ ఏడాది అభిషేక్ నుంచి ఎలాంటి సినిమాలు రాలేదు. తాజాగా అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. 

ఒక లక్ష్యంతో, ఆశయంతో పనిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు అని అభిషేక్ ఓ కొటేషన్ ని ట్వీట్ చేశాడు. అభిషేక్ ట్వీట్ కు ఓ నెటిజన్ వెటకారంగా రిప్లై ఇచ్చాడు. ఓ వ్యక్తి సోమవారం కూడా ఖాళీగా ఉంటే అతడిని నిరుద్యోగి అని పిలుస్తారు అని కామెంట్ చేశాడు. 

దీనికి అభిషేక్ హుందాగా బదులిచ్చి అతడి నోరు మూయించాడు. మీ అభిప్రాయంతో నేను విభేదిస్తున్నా. కొందరు ఎలాంటి పని చేసినా దానిని ప్రేమిస్తారు' అని అభిషేక్ బదులిచ్చాడు. 

ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ అనురాగ్ బసు తెరక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ 2020లో విడుదల కానుంది. గతంలో అభిషేక్ బచ్చన్ కు ఇలాంటి ట్రోలింగ్స్ ఎన్నో ఎదురయ్యాయి. కానీ ఎప్పుడూ అభిషేక్ సహనం కోల్పోలేదు.