ప్రముఖ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తమ్ముడు, నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. అయితే అప్పటివరకు సినిమా ఈవెంట్ లలో కనిపించిన అభిరామ్.. శ్రీరెడ్డి ఇష్యూ తరువాత బయట ఎక్కడా కనిపించలేదు. 
ఇండస్ట్రీలోకి రాకముందే అభిరామ్ పై నెగెటివ్ వార్తలు మొదలయ్యాయి. 

శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలలో అభిరామ్ తనను ముద్దుపెట్టుకున్నట్లు కొన్ని ఫోటోలు ఎంతో అసభ్యంగా ఉన్నాయి. దీంతో అభిరామ్ హాట్ టాపిక్ గా మారాడు. ఈ దెబ్బకి అభిరామ్ జాడ బయటకి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తండ్రి సురేష్ బాబు.. అభిరామ్ ని బెంగుళూరు పంపించారని, అక్కడ వ్యవహారాలూ చూసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. నిజానికి శ్రీరెడ్డి వ్యవహారానికి ముందే అభిరామ్ ని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు. 

నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఈ మేరకు ప్రయత్నించారు. కానీ సురేష్ బాబు అంత ఆసక్తి చూపించలేదు. తాజా అందుతున్న సమాచారం ప్రకారం.. అభిరామ్ స్క్రీన్ మీద కనిపించడానికి ఎక్కువరోజులు పట్టకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం అభిరామ్ అదే టార్గెట్ గా పెట్టుకుని ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలో లీడింగ్ యాక్టింగ్ ట్రైనర్ దగ్గర అభిరామ్ శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది.

హీరోకి కావాల్సిన అన్ని రకాల శిక్షణలు తీసుకుంటున్నట్లు సమాచారం. తిరిగి హైదరాబాద్ రావడానికి ఎక్కువ సమయంలో పట్టదని అంటున్నారు. సరైన కథ కోసం సురేష్ బాబు చూస్తున్నారని, స్క్రిప్ట్ ఫైనల్ అయిన వెంటనే అభిరామ్ ని తన సొంత బ్యానర్ ద్వారా పరిచయం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

వారసత్వంతో ఇండస్ట్రీలోకి చాలా మంది నటులు ఎంట్రీ ఇచ్చారు. అయితే తమ టాలెంట్ ని నిరూపించుకున్న వారే హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. మరి అభిరామ్ కూడా నటుడిగా తన సత్తా చాటతాడేమో చూడాలి!