బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కెరీర్ లో మరోసారి రీమేక్ కథపై ద్రుష్టి పెట్టాడు. తమిళ్ గజినీ సినిమాతో అప్పట్లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక చాలా కాలం తరువాత ఈ బాక్స్ ఆఫీస్ హీరో మరో తమిళ్ కథను గట్టిగా నమ్ముతున్నాడు. అదే విక్రమ్ వేధా. 2017లో కోలీవుడ్ లో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.

విజయ్ సేతుపతి - మాధవన్ నటించిన ఈ మినీ మల్టీస్టారర్ ని పుష్కర్ - గాయత్రీ దంపతులు తెరకెక్కించారు. సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి చాలా మంది టెక్నీషియన్స్ ముందుకు వచ్చారు. తెలుగులో కూడా సినిమా రీమేక్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక బాలీవుడ్ లో గత కొంత కాలంగా అమీర్ ఖాన్ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

ఇక రీసెంట్ గా అమీర్ స్క్రిప్ట్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి చేసిన పాత్రలో అమీర్ నటిస్తుండగా మాధవన్ నటించిన పాత్రలో మరో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నాడు. సినిమాలో కంటెంట్ లో తేడా రాకుండా ఉండడానికి అమీర్ కథ ఒరిజినల్ దర్శకులని సెలెక్ట్ చేసుకున్నాడు.

ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతున్నాయి. త్వరలో స్పెషల్ ఎనౌన్స్మెంట్ తో సినిమాకు సంబందించిన షెడ్యూల్స్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. అమీర్ ఖాన్ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.