ఆమీర్ ఖాన్ ఇంట పెళ్ళి సందడి, కెల్విన్ వేడుకలతో ఘనంగా స్టార్ట్ అయిన వివాహ వేడుకలు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ఇంట పెళ్ళి సందడి స్టార్ట్ అయ్యింది. ఈమధ్యే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వినిపించిన ఆమీర్ ఖాన్.. తాజాగా తన ఇంట్లో పెళ్ళి సబందడికి సబంధించి అప్ డేట్ ను అందించారు.

ఆమిర్ ఖాన్ ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఇప్పటికే ఆయన ఇంట్టో పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది. ఆమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తా ల గారాల తనయ ఐరా ఖాన్ నిశ్చితార్థం 2022 నవంబర్ 18 లో జరిగిన సంగతి తెలిసిందే. ఎంతో కాలం నుంచి ఆమె ప్రేమిస్తున్న నుపుర్ శిఖర్ ను పెళ్ళాడబోతుంది ఐరా. ఇరుకుటుంబాలు ఒప్పుకోవడంతో.. నిశ్చితార్దం ఘనంగా జరిగింది. ఇక తాజాగా పెళ్ళి పనులు కూడా స్టార్ట్ అవ్వగా.. ఓ కార్యక్రమంతో పెళ్ళికి ముందు ఫార్మాలిటీస్ కూడా స్టార్ట్ చేశారు.
వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో రెండు నెలల ముందే వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. నుపుర్ శిఖరే మహారాష్ట్రకు చెందిన అబ్బాయి కావడంతో వారి సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి పనులు జరుగుతున్నాయి అయితే వీరి సంప్రదాయం ప్రకారం తాజాగా కెల్వన్ వేడుకను నిర్వహించారు. దీనితో వారి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు స్టార్ట్ అయ్యారు. అసలు కెల్వన్ వేడుకలు అంటే.. వధూవరుల కుటుంబాలు పెళ్లికి ముందు సంప్రదాయ రుచికరమైన భోజనం చేసుందుకు ఒకరినొకరు కలుసుకుంటారు. తద్వారా ఒకరినొకరు పెళ్లికి ఆహ్వానించవచ్చు. ఇందులో ఒకరికొకరు బహుమతులు కూడా ఇస్తారు.
ఒకరిని భరొకరు ప్రేమించుకోవడంతో.. నిశ్చితార్ధం తరువాత ఈసెలబ్రిటీలు ఇద్దరు కలిసి తిరగడం స్టార్ట్ చేశారు.ఫారెన్ టూర్లు.. వెకేషన్లతో పాటు.. హాట్ హాట్ ఫోటోలతో దర్శనం ఇచ్చారు. ఇక పెళ్ళి ఘడియలు రావడంతో.. వీరి పెళ్లికి సబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదరుచూస్తున్న ఫ్యాన్స్ కు ఆమీర్ స్వంగా గుడ్ న్యూస్ తెలిపారు. వీరి వివాహానికి సబంధించిన డేట్ ను అనౌన్స్ చేశారు.
2024 జనవరి 13న కుమార్తె వివాహం జరగనున్నట్టు ఆయన ప్రకటించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ దీనిపై స్పందించారు. ‘‘ఐరా జనవరి 13న వివాహం చేసుకోబోతోంది. అతడి పేరు నుపుర్. అతడో లవ్ లీ బోయ్. ఐరా మానసికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమెకు అండగా నిలిచాడు. ఆమెకు తోడుగా, మద్దతుగా నిలిచిన వ్యక్తి. వారు కలసి ఎంతో సంతోషంగా ఉన్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది.
అంతే కాదు... వారు ఒకరిగురించి..ఒకరు బాగా అర్ధం చేసుకున్నారు.. వారు ఒకరి కోసం ఒకరు శ్రద్ధ తీసుకోగలరు అని ఆమిర్ ఖాన్ తెలిపారు. నుపుర్ తనకు కుమారుడితో సమానమని ఆమిర్ పేర్కొన్నారు. అతడ్ని తమ కుటుంబ సభ్యుడిగానే భావిస్తున్నట్టు చెప్పారు. నుపుర్ తల్లి ప్రీతమ్ జీ ఇప్పటికే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని ఆమీర్ ఖాన్ అన్నారు. వీరి పెళ్ళికి బాలీవుడ్ నుంచి భారీగా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.