Asianet News TeluguAsianet News Telugu

ఆ రాబిన్‌ హుడ్‌ నేను కాదు.. క్లారిటీ ఇచ్చిన హీరో

ఢిల్లీలోని ఓ పేదల కాలనీలో ఓ అజ్ఞాత వ్యక్తి పిండి ముద్దల్లో డబ్బు పెట్టి పంచినట్టుగా వార్తలు వచ్చాయి. అసలైన పేదలను గుర్తించేందుకు కేవలం కేజి గోదుమ పిండి పంచుతున్నట్టుగా చెప్పారు. ఆ పిండి కోసం వచ్చిన వారికి పిండి ముద్దల్లోనే 15 వేల రూపాయల పెట్టి పంచినట్టుగా ప్రచారం జరిగింది.

Aamir Khan Clarifies On 'money In Wheat Bags' With Robin Hood Reference
Author
Hyderabad, First Published May 4, 2020, 3:00 PM IST

ప్రస్తుతం కరోనా కారణంగా పేద, మ ధ్య తరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. అయితే ఈనేపథ్యంలో పలువురు సెలబ్రిటీ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. చాలా మంది స్టార్స్ తమ వంతుగా ప్రభుత్వాలకు విరాలాలు ప్రకటిస్తుంటే, మరికొందరు ప్రత్యక్షంగా తామే సాయాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఓ వార్త మీడియాలో ప్రముఖంగా వినిపించింది.

ఢిల్లీలోని ఓ పేదల కాలనీలో ఓ అజ్ఞాత వ్యక్తి పిండి ముద్దల్లో డబ్బు పెట్టి పంచినట్టుగా వార్తలు వచ్చాయి. అసలైన పేదలను గుర్తించేందుకు కేవలం కేజి గోదుమ పిండి పంచుతున్నట్టుగా చెప్పారు. ఆ పిండి కోసం వచ్చిన వారికి పిండి ముద్దల్లోనే 15 వేల రూపాయల పెట్టి పంచినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆ డబ్బు బాలీవుడ్‌ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ పంచి పెట్టినట్టుగా ప్రచారం జరిగింది. దీంతో ఆమిర్ అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ గురించి విని పండగ చేసుకున్నారు.

అయితే ఈ విషయంపై తాజాగా ఆమిర్‌ ఖాన్‌ స్పందించాడు. గోదుమ పిండిలో డబ్బు పెట్టి పంచింది నేను కాదు అంటూ ప్రకటించాడు ఆమిర్‌ ఖాన్‌. అంతేకాదు అది పూర్తిగా ఫేక్‌ న్యూస్‌ అయినా అయి ఉంటుంది లేదా.. తన పేరు బయటకు చెప్పటం ఇష్టం లేని  రాబిన్‌ హుడ్ లాంటి వ్యక్తి ఎవరైనా చేసి ఉంటాడు. అంటూ తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు ఆమిర్‌ ఖాన్. అయితే కరోనా మహమ్మారి కబలిస్తున్న వేళ బాలీవుడ్ తారలు తమ వంతు సాయం చేస్తుండగా ఆమిర్ ఖాన్ మాత్రం ఇంత వరకు తాను ఈ సాయం చేస్తున్నా అంటూ ప్రకటించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios