హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'ఆకాశం నీహద్దురా'. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య మరోసారి తన విలక్షణమైన నటనతో అదరగొడుతున్నాడు. సామాన్యులకు సైతం విమానయాన సౌకర్యం ఉండాలని కలలుకన్న కెప్టెన్ గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ఈ వేసవిలో ఆకాశం నీహద్దురా చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దీనితో చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. తాజాగా ఈ చిత్రంలోని పిల్ల పులి అనే రొమాంటిక్ సాంగ్ ని విన్నూత్నంగా రిలీజ్ చేశారు. 100 మంది పిల్లలు, చిత్ర యూనిట్ ఫ్లైట్ లో ప్రయాణిస్తూ ఆకాశంలో ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. 

జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. పిల్ల పులి సాంగ్ అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తోంది. పిల్ల పులి సాంగ్ వీరిద్దరి మధ్య కెమిస్టీ ఎలా ఉండబోతోందో తెలియజేస్తోంది. పిల్ల పులి.. పోరగాడే నీకుబలి అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అనురాగ్ కులకర్ణి ఈ పాటని పాడారు. 

సూర్య రఫ్ లుక్ లో కనిపిస్తూనే అపర్ణతో రొమాన్స్ అదరగొట్టేశాడు. అపర్ణ కూడా లిరికల్ వీడియో చూపిన విజువల్స్ లో సూర్యతో మంచి కెమిస్ట్రీ కనబరిచింది.ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాంగ్ లాంచ్ సందర్భంగా దర్శకురాలు మాట్లాడుతూ మోహన్ బాబు గారు తనకు మరో తండ్రి అని పేర్కొన్నారు. ఇక సూర్య కూడా మోహన్ బాబు గారు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి అని ప్రశంసలు కురిపించాడు. పిల్ల పులి సాంగ్ పై ఓ లుక్కేయండి.