మరోసారి రీ యూనియన్ పార్టీతో 80ల కాలంలోని తారలు ఒకే చోట దర్శనమిచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి సినీ రంగంలో అలుపు లేకుండా రానిస్తున్న సీనియర్ తారలు జీవితంలో వారి తోటి నటీనటులను ఎప్పటికి మరచిపోలేరు. మరచిపోతే వారి జీవితానికి అర్ధం లేదు. అందుకే పాతబడిన జ్ఞాపకాలను ఒకేచోట మళ్ళీ పునర్జన్మని ఇస్తూ సినీ తారలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో 10వ రీ యూనియన్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఒకేచోట చేరి తారలు వారి మధుర జ్ఞాపకాలను గూర్తు చేసుకున్నారు. అంత్యాక్షరితో పాటు కొన్ని ఇండోర్ గేమ్స్ తో మెగాస్టార్ నివాసంలో సందడి నెలకొల్పారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.   ఈ ర్ యూనియర్ లో తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషలకు చెందిన 40 మంది నటీనటులు పాల్గొన్నారు.

అందులో.. జయరామ్, ప్రభు, సురేశ్, నదియా, రాధ, సరిత, అమల, జగపతిబాబు, జయసుధ, సుమలత, రెహమాన్, ఖుష్భూ, వెంకటేశ్, రాధిక, భానుచందర్, సుమన్, శోభన, నాగార్జున, రమేశ్‌ అరవింద్, జాకీ ష్రాఫ్, సుహాసిని, మోహన్‌లాల్, లిజీ, భాగ్యరాజ్, జయసుధ, శరత్‌కుమార్, వీకే నరేశ్ తదితరులు పాల్గొన్నారు. గోల్డ్ అండ్ - బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో ఈ వేడుకలో ప్రతిఒక్కరు వారి గ్లామర్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.