యంగ్ హీరోయిన్ సునైనా తెలుగు తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 2006లో విడుదలై విజయం సాధించిన 10th క్లాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది ఈ సునైనానే. ఆ తర్వాత కొన్ని చిన్న చిత్రాల్లో సునైనా నటించింది. 

సునైనా ఎక్కువగా తమిళంలో అవకాశాలు అందుకుంది. గత కొంతకాలంగా సునైనా తమిళ హీరో కృష్ణ అలియాస్ క్రేష్ణతో రిలేషన్ షిప్ లో ఉంది. కానీ వీరిద్దరూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ జంట వివాహానికి రెడీ అవుతున్నట్లు తమిళ సినీ వర్గాలు, సునైనా సన్నిహితులు చెబుతున్నారు. 

మనోరమ కుమారుడు ఆత్మహత్యాయత్నం, షాకింగ్ రీజన్

2014లో క్రేష్ణ, సునైనా వన్మం అనే చిత్రంలో కలసి నటించారు. అప్పటి నుంచి వీరిమధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న కరోనా ప్రభావం తగ్గగానే సునైనా, క్రేష్ణ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం సునైనా వయసు 30 ఏళ్ళు కాగా క్రేష్ణ వయసు 42 ఏళ్ళు. 

క్రేష్ణకు ఆల్రెడీ పెళ్లయింది. 2014లో క్రేష్ణ, హేమలత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరిద్దరి మధ్య విభేదాల కారణంగా విడాకులు పొందారు. తన భార్య వేధిస్తోంది అంటూ అప్పట్లో క్రేష్ణ స్వయంగా పోలీస్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.