యూత్ లో విజయ్ దేవరకొండకు క్రేజ్ అంతా ఇంతా కాదు. దానికి తోడు అతని యాటిట్యూడ్ తో ఇచ్చే ఇంటర్వూలు మరింత గా కుర్రాళ్లని దగ్గర చేస్తున్నాయి. లైగర్ ప్రమోషన్స్ ఓ ప్రక్కన పాల్గొంటూనే తన తర్వాత చిత్రం ఖుషీ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. 


విజయ్ దేవరకొండ పబ్ లో రచ్చ రచ్చ చేసాడు. చుట్టూ సాప్ట్ వేర్ కుర్రాళ్లు..డాన్స్ లు, ఎగరటాలు. అయితే ఇదంతా నిజ జీవితంలో కాదు. విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఖుషీ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన పబ్ సెట్ లో షూటింగ్ చేసారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా కనపడతారు. హీరో పనిచేసే సాఫ్ట్ వేర్ కంపెనీ 10 వ ఏనవర్శరీ సందర్బంగా ఈ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ సినిమాకు హైలెట్ కానుందని సమాచారం. ఈ పాటలో సమంత లేదు. 

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తూ ఖుషి సినిమాలో సమంత హీరోయిన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. మహానటి సినిమా తర్వాత మళ్లీ సమంత మరియు విజయ్ దేవరకొండ ఈ సినిమా తో జత కట్టనున్నారు. ఈ రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమాకి "ఖుషి" అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ టైటిల్ తో ఏమాత్రం సంతోషంగా లేరు. అయినా సరే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న శివ నిర్వాణ గతంలో తన "నిన్ను కోరి", "మజిలి" వంటి సినిమాలతో మెప్పించడం తో ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని కొందరు చెబుతున్నారు. 

 ఈ సినిమాకి "ఖుషి" అనే టైటిల్ పెట్టడం వెనుక పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత పాత్ర పేరు ఖుషి. అందుకే సినిమాకి కూడా అదే టైటిల్ ను ఖరారు చేసారు. నిజానికి 2001లో పవన్ కళ్యాణ్ మరియు భూమిక నటించిన "ఖుషి" సినిమాలో భూమిక పాత్ర పేరు "ఖుషి" కాదు. అయితే ఈ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన హిందీ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. అందులో ఆమె పాత్ర పేరు ఖుషి సింగ్. మరి ఇప్పుడు ఖుషి పాత్రలో సమంత ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.