వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా  డైరక్టర్ బాబి (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్స్ గా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి... వివేక్‌ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ చిత్రం రిలీజ్ పై చాలా రోజులుగా టెన్షన్ నెలకొని ఉంది.

క్లారిటీ లేకుండా పోయింది. దాంతో మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫూజ్ గా ఉన్నాయి. వెంకీ మామ పెద్ద సినిమా కాబట్టి దాని రిలీజ్ ని తాము ప్లాన్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నవాళ్ళు సురేష్ బాబు మాట కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన ఎంతకీ తేల్చకపోయేసరికి తలపట్టుకున్నారు. అయితే తాజాగా ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు.

వెంకీ మామ సినిమాని డిసెంబరు 13న విడుదల చేయాలనుకుంటున్నారని తాజా సమాచారం.  వాస్తవానికి  నవంబర్‌ నుంచి డిసెంబర్‌ మూడవ వారం వరకు సినిమా రిలీజ్ లకు కరెక్టు టైమ్ కాదని  సురేష్‌బాబుకి తెలుసు. సీనియర్‌ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా అనుభవం ఉన్న సురేష్ బాబుకు తెలుసు. దాంతో ఈ డేట్ ..వెంకీ పుట్టిన రోజైనా...రిలీజ్ చేయటం ఇష్టం లేదట.

కానీ సోలో రిలీజ్ కావాలంటే ఈ డేటే ఫెరఫెక్ట్. దానికి తోడు చాలా కాలంగా వెంకీ పుట్టిన రోజున ..ఆయన సినిమా రిలీజ్ చేయమని ఫ్యాన్స్ అడుగుతున్నారు. దాంతో రిస్క్ చేసి ఆ రోజున వదిలేద్దామనేది సురేష్ బాబు ఆలోచనగా చెప్తున్నారు.  సినిమా కంటెంట్ విషయం ఉంది కాబట్టి లాగేస్తుందని భావిస్తున్నారు. నాగచైతన్య, వెంకీ కలిసి నటిస్తున్నారు కాబట్టి మంచి ఓపినింగ్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

read also: టాలీవుడ్ లోకి రీఎంట్రీ.. రవితేజపై శృతి హాసన్ కామెంట్స్!

ఎలాగో డిసెంబర్ 25న క్రిసమస్..శెలవలు ఉంటాయి. బాగుంటే సినిమా రెండో వారం కూడా అదరకొడుతుందని లెక్కలు వేసుంటారు.  నిజ జీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకటేశ్, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో మామ, అల్లుడిగా డిసెంబరులో వెండితెరపై సందడి చేయబోతున్నారన్నమాట.  రిలీజ్‌ డేట్‌పై అతి త్వరలో అఫీషియల్ గా  ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది.