ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో మల్టీ స్టారర్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ చిత్రాలు కూడా రెడీ అవుతున్నాయి. అదే బాటలో ఓ క్రేజీ మీడియం రేంజ్‌ మల్టీ స్టారర్ రెడీ అవుతోంది. అదే `వి ద మూవీ`.

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబులు హీరోలుగా నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నాని తొలిసారిగా నెగెటివ్ రోల్‌ లో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగా సినిమాను రూపొందించాడు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటక వచ్చింది. ఈ సినిమా కోసం ముందుగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అయితే కరెక్ట్ అని భావించాడట దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. వాళ్లకు కథ వినిపించేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే మహేష్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం, పవన్ రాజకీయాలతో సినిమాలకు బ్రేక్ ఇవ్వటంతో నాని, సుధీర్ బాబు హీరోలుగా ఆ సినిమాను రూపొందించాడు దర్శకుడు.

నిజంగా ఇంద్రగంటి మోహన కృష్ణ అనుకున్నట్టుగా పవన్‌, మహేష్ బాబులు ఈ సినిమాలో నటించి ఉంటే సుధీర్ బాబు పోషించిన పోలీస్, నాని పోషించిన నెగెటివ్‌ పాత్రల్లో మహేష్, పవన్‌ లు ఎవరు ఏ పాత్రలో కనిపించే వారు అన్న ఆసక్తి కర చర్చ జరుగుతోంది.