'సైరా నరసింహారెడ్డి' సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ.. ఇందులో పాన్ ఇండియా కంటెంట్ లేదనే మాటలు వినిపించాయి. తెలుగు రాష్ట్రాలను చెందిన ఓ పోరాటయోధుడి కథని దేశమంతా ఓన్ చేసుకోలేకపోయింది. పొరుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్లు తగ్గడానికి కూడా అదే కారణం. 'బాహుబలి', 'కేజీఎఫ్' లాంటి సినిమాలు ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ అవ్వడానికి, 'సైరా' ఫెయిల్ అవ్వడానికి అదే పెద్ద తేడా.

ఇప్పుడు ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. తన కెరీర్ లో మొదటిసారి హిస్టారికల్ సబ్జెక్ట్ తీసుకున్నాడు రాజమౌళి. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అంటూ ఇద్దరు తెలుగువీరుల కథను తెరపైకి తీసుకొచ్చాడు. ఒకే కాలానికి చెందిన వారు అయినప్పటికీ ఇద్దరివీ వేర్వేరు నేపధ్యాలు. చరిత్రలో వీరిద్దరూ కలిసి పోరాడి ఉండి ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు రాజమౌళి.

అయితే 'సైరా' రిజల్ట్ చూసిన రాజమౌళికి ఒకరకమైన సందేహం కలుగుతోందట. తెలుగు వీరుల కథను చెప్పాలనుకున్నప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా వింటుందా లేదా అనే ఆలోచనలో పడ్డాడు రాజమౌళి. అందుకే ఇప్పుడు స్క్రీన్ ప్లే పరంగా కొన్ని మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఇప్పటివరకు తీసిన సబ్జెక్ట్ కి ఎంతమాత్రం ఇబ్బంది కలగకుండా... ఇకపై తీసే సన్నివేశాల్లో ఎక్కడా స్థానికత హైలైట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తెలుగువీరుల కథ అని కాకుండా ప్రపంచవీరుల కథగా తెరకెక్కిస్తే యూనివర్సల్ అప్పీల్ వస్తుందని ఇప్పుడు అవే మార్పులు 'RRR' లో చేస్తున్నట్లు సమాచారం.