హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాలో నాగచైతన్య ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ ని విడుదల చేశారు.

ఇందులో నాగచైతన్య చీపురు పట్టి ఊడుస్తూ, డబ్బులు జాగ్రత్త చేస్తూ ఇలా మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వ్యక్తి పాత్రలో కనిపించాడు. ఈ సన్నివేశాలన్నీ కూడా ఎంతో సహజంగా ఉన్నాయనే చెప్పాలి. హజత్వం నింపుకొన్న ఉన్న పాత్రలతో అందమైన కథలను తెర మీద కు తెచ్చే శేఖర్ కమ్ముల ఈ ప్రేమ కథను మరింత హృద్యంగా మలుచుతున్నాడు.

నాగ చైతన్య లుక్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఈ టీజర్ మాత్రం అక్కినేని అభిమానులకు కొత్త అనుభవాన్ని కలిగించింది. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు, దేవయాని ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి పవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.