తమ్ముడితో కలిసి కట్టుకున్న భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. అనంతరం నోట్లో యాసిడ్ పోసి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం లో చోటుచేసుకుంది. కానీ... చివరకు పోలీసులకు చిక్కి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...  జీడిమెట్ల గాజుల రామారం, నెహ్రూనగర్ కు చెందిన కూలీ పనిచేసే నూనె నర్సింహులు(43) తన భార్య సునీత(40)తో కలిసి కొంతకాలం క్రితం రాయదుర్గం మధురానగర్ కు వచ్చి నివసిస్తున్నారు. నర్సింహులు మద్యానికి బానిసయ్యాడు. తాగి వచ్చి భార్యతో గొడవపడి కొట్టేవాడు. వేధింపుల గురించి అదే ప్రాంతంలో నివసించే తన తమ్ముడు సద్దుల శ్రీనివాస్(34)కు చెప్పి భర్తను హత్య చేయాలని ప్లాన్ వేసింది.

ఈ ప్లాన్ లో భాగంగా తమ్ముడిని ఇంటికి పిలిపించింది. తాగిన మైకంలో ఉన్న భర్త తలపై కర్రతో కొట్టింది. అనంతరం నైలాన్ తాడుతో మెడకు బిగించి ఉరి వేశారు. చనిపోయాడు అని నిర్థారించుకున్న తర్వాత నోట్లో యాసిడ్ పోశారు. కాగా... బంధువులకు మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించింది. గత కొంతకాలంగా అనారోగ్యం సరిగాలేకపోవడంతో... మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అయితే... అతని మెడపై ఉన్న గాయాలను చూసి అనుమానం రావడంతో బంధువులు పోలీసులకు విషయం తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...విచారణలో అసలు నేరస్థులను గుర్తించారు. భార్య సునీత, ఆమె తమ్ముడు శ్రీనివాస్ ని పోలీసులు అరెస్టు చేశారు.