శామీర్ పేట అద్రాస్ పల్లిలో దారుణం జరిగింది. చేతబడి చేశాడనే అనుమానంతో ఓ యువకుడిని చితిపై పడుకొపెట్టి సజీవ దహనం చేశారు. గ్రామంలో ఓ మహిళ ఇటీవల ప్రాణాలు కోల్పోగా... దానికి ఈ యువకుడే కారణమంటూ ఈ దారుణానికి ఒడిగట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.... అద్రాస్ పల్లికి చెందిన ఓ మహిళ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమెకు గ్రామానికి చెందిన ఆంజనేయులు(24) అనే యువకుడు చేతబడి చేశారని సదరు మహిళ కుటుంబసభ్యులు ఆరోపించారు. సదరు మహిళ చితిపైనే బలవంతంగా యువకుడిని పడుకోబెట్టి... చితికి నిప్పు అంటించారు. దీంతో..  యువకుడు సజీవదహనం అయ్యాడు.

మరోవైపు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.