ప్రమాదవశాత్తు నీటి బకెట్ లో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... మండలంలోని రాజపేట శివారు పాపిగానితండాకు చెందిన విజయ్, సాలమ్మ రెండేళ్ల కుమారుడు విజయ్ ఇంటి ముందు ఆడుకుంటూ అక్కడే ఉన్న బకెట్ లో ప్రమాదవశాత్తు పడిపోయాడు.

సాలమ్మ ఇంటి నుంచి బయటకు వచ్చి బకెట్ లో పడిన కుమారుడిని బయటకు తీసింది. కాగా... అప్పటికే చిన్నారి మృతిచెందాడు. తమ కళ్లముందు ఆడుకుంటూ ఉన్న చిన్నారి ఒక్కసారిగా ప్రాణాలు పొగొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.