Asianet News TeluguAsianet News Telugu

మొక్కలు తిన్న మేకలు... అరెస్టు చేసిన పోలీసులు

మేకల యజమానులు గగ్గోలు పెట్టడంతో... రూ.పదివేల జరిమానా విధించి వాటిని విడుదల చేయడం గమనార్హం. మేకలను అదుపు చేయాలని చాలా సార్లు చెప్పినా.. యజమానులు పట్టించుకోలేదని వారు చెబుతున్నారు. 

Telangana: 2 goats 'arrested' for grazing on saplings, owner fined
Author
Hyderabad, First Published Sep 12, 2019, 4:05 PM IST

మొక్కలు తిన్నాయని రెండు మేకలను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హరితహారం మొక్కలను తిన్నాయని వాటిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. 

పూర్తి వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో సేవ్ ద ట్రీ అనే స్వచ్ఛంద సంస్థ దాదాపు 980 మొక్కలను నాటారు. అందులో దాదాపు 250 మొక్కలు వరకు మేకలు తినేశాయి. ఇదే అంశానికి సంబంధించి మేకల యజమానులకు పలుసార్లు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో బుధవారం స్కూల్ ఆవరణలో మొక్కలను తింటున్న రెండు మేకాలను స్వచ్చంద సంస్థ సభ్యులు పోలీసులకు అప్పగించారు.

మేకల యజమానులు గగ్గోలు పెట్టడంతో... రూ.పదివేల జరిమానా విధించి వాటిని విడుదల చేయడం గమనార్హం. మేకలను అదుపు చేయాలని చాలా సార్లు చెప్పినా.. యజమానులు పట్టించుకోలేదని వారు చెబుతున్నారు. మేకల కారణంగానే మొక్కలు చనిపోయాయయని అందుకే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఏది ఏమైనా పోలీసులు మేకలను అరెస్టు చేయడం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేగింది.

Follow Us:
Download App:
  • android
  • ios