కర్నూల్: యురేనియం పై పోరాడుతున్నందుకే ప్రభుత్వం తనపైనే కాదు మొత్తం కుటుంబంపై కక్షగట్టిందని మాజీ మంత్రి, టిడిపి నాయకురాలు భూమా అఖిలప్రియ ఆరోపించారు. తనపైనా, భర్తపైన వస్తున్న వదంతులపై ఆమె తాజాగా స్పందించారు. దీనిపై కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా  సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ...పనిగట్టుకొని పోలీసులు తనను వేధిస్తున్నారంటూ మండిపడ్డారు.యురేనియం పై తాను పోరాటం ప్రారంభించినప్పటినుండే వ్యూహాత్మకంగా తమను పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రయత్నంచేస్తున్నారంటూ ఆరోపించారు. తనకే కాదు కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఎలాంటి కీడు జరిగినా జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సి వస్తుందనిహెచ్చరించారు.

Read more వంశపారంపర్య అర్చకత్వం...చంద్రబాబు నిర్ణయమే కాపీ...: వేమూరి ఆనందసూర్య...

తన ఐదేళ్ల రాజకీయాల్లో చాలా నేర్చుకున్నానని అఖిల ప్రియ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడం ఓ రకంగా మంచిదే అయ్యిందన్నారు. ఈ ఓటమి తర్వాత మనవారు ఎవరో... మనల్ని ముంచే వారు ఎవరు అన్న సత్యం తెలుసుకున్నానని పేర్కొన్నారు. తన భర్త భార్గవ్‌ రామ్ కులం వల్ల తాను ఓడిపోయాననే వార్తలు తనను ఎంతగానో బాధించాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. 

తాను యురేనియం పై వ్యతిరేకంగా పోరాడేందుకు పులివెందులకు వెళ్లి రాగానే  కేసులు నమోదు అయ్యాయని ఆరోపించారు. పోలీసులు మా ఇంటికి వచ్చి ముగ్గురిని అరెస్టు చేశారనేది అవాస్తవమని స్పష్టం చేశారు.

Read more జగన్ డిల్లీ పర్యటన ఎందుకోసమో...?: మంత్రులకు అనగాని సవాల్...

తాను మంత్రిగా విధులు నిర్వహించినప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఏ ఒక్కరిపై కూడా తప్పుడు కేసులు పెట్టలేదన్న సంగతి గుర్తు చేశారు. కర్నూల్ జిల్లా ఎస్పీ పర్సనల్ గా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ అఖిలప్రియ ఆరోపించారు. తాను అన్ని ఆదారాలతో సహా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు.

 తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. తన కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే జిల్లా ఎస్పీనే బాద్యత వహించాలన్నారు. వారంట్ లేకుండా ఇళ్లు సెర్చ్ చేయడం హీరోయిజం కాదనీ ఎద్దేవా చేశారు.

ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా...భయపడననీ, యురేనియం తవ్వకాలపై పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదనీ స్పష్టం చేశారు. తమకు బెయిల్ వచ్చినా ఇలా ఇబ్బందులు పెట్టడం మంచిది కాదనీ అఖిల ప్రియ హితవు పలికారు. 

వీడియో

"