మహాబూబ్‌నగర్: ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని చిన్న చింతకుంట మండలం మద్దూరులో దొంగతనం పేరుతో  టెన్త్ విద్యార్ధి తారక్ పై గ్రామ పెద్దలు దాడికి దిగారు. ఈ ఘటనలో మనస్తాపానికి గురైన టెన్త్ విద్యార్ధి  కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 చిన్నచింతకుంట మండలం  మద్దూరులో  దొంగతనం చేశాడని  పదో తరగతి విద్యార్ధి తారక్ పై నిందలు వేశారు. అంతేకాదు పంచాయితీ పెట్టి అతడిని కొట్టారు గ్రామ పెద్దలు. పంచాయితీ పెట్టి మరీ  తనపై దాడి చేయడంతో   తారక్  మనస్థాపానికి గురయ్యాడు.

ఈ మనస్థాపంతో  తారక్ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  తారక్ మృతి చెందాడు.