కర్నూలు జిల్లా లోని కౌతాలం మండల కేంద్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిండికేట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో పెచ్చులూడి కూలేందుకు సిద్ధమైంది. దీంతో బ్యాంకు సిబ్బంది భయపడుతున్నారు. దీంతో బ్యాంకు బయటే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

కర్నూల్ జిల్లాలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  పై కప్పు నుండి పెచ్చలూడి పడుతుంది. మరో భవనం అద్దె కోసం బ్యాంకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ, కొత్త భవనం దొరకలేదు.  పాత భవనంలోనే విధులు నిర్వహించేందుకు అధికారులు సిద్దంగా లేరు. ఎప్పుడు భవనం కుప్పకూలుతోందోననే భయంతో అధికారులు ఉన్నారు.

భవనం పైకప్పు పెచ్చులూడి కింద పడుతోంది. దీంతో బ్యాంకు బయటే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. బ్యాంకులోపల కాకుండా బయటే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఆరుబయట విధులు నిర్వహించడం వల్ల  ఖాతాదారులు ఇబ్బందిపడుతున్నారు.

ఈ కారణంగా అధికారులు బ్యాంకుకు తాళం వేశారు. నగదు కోసం ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనం ఎప్పటికి దొరుకుతోందోనని గ్రామ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.