బిడ్డ పుట్టి పది రోజులు కూడా గడవక ముందే కన్నుమూశాడు. బాధ్యతగా దహన సంస్కారాలు చేయాల్సిన బిడ్డ తల్లిదండ్రులు జాలి కూడా లేకుండా ప్రవర్తించారు. శిశువు మృతదేహాన్ని రోడ్డుపైనే విసిరేసి వెళ్లిపోయారు. కాగా... ఆ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి.

మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసిన స్థానికులు బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 13లో శునకాల హడావుడి ఎక్కువగా ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అటువైపు వెళ్లారు. రోడ్డు పక్కనే ఉన్న శిశువును పీక్కుతినేందుకు పోటీ పడుతున్నాయి. అప్పటికే భుజాన్ని పూర్తిగా పీకేశాయి. చేతులను శరీరం నుంచి వేరు చేశాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.