మీ సమస్యలను నాకు చెప్పండి.. ప్రజలతో ఎస్పీ ముఖాముఖి

ఆ రోజు జిల్లా పోలిసు ఉన్నతాధికారులందరూ ఎస్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, బాధితులకు సంబంధించిన సమస్యను సంబంధిత స్టేషన్ పరిధిలోని ఎస్.ఎచ్.ఓ సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.

sircilla SP Rahul hegde arrange one on one program on september 24th

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సిరిసిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వినూత్న విధానాన్ని ఎంచుకున్నారు. పోలీసు అధికారులందరితో కలిసి స్వయంగా తానే జిల్లా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో ఎవరికైనా చట్ట పరమైన సమస్యలు ఉన్నా, ఏవైనా కేసులలో ఇబ్బంది ఎదుర్కొంటున్నా స్వయంగా ఈ మంగళవారం ఈ నెల 24 వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో తనను సంప్రదించవచ్చని తెలిపారు. 

ఆ రోజు జిల్లా పోలిసు ఉన్నతాధికారులందరూ ఎస్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, బాధితులకు సంబంధించిన సమస్యను సంబంధిత స్టేషన్ పరిధిలోని ఎస్.ఎచ్.ఓ సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. 

ఈ మంగళవారం రోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్.ఎచ్.ఓ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను, వినతులను స్వీకరించి వాటిని అక్కడిక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి చట్టపరమైన, భద్రతాపరమైన సమస్యలు ఏమైనా ఉంటె ఎటువంటి భయం లేకుండా చెప్పుకోవాలని కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios