మొక్కలు తిన్నాయని మొన్నటికి మొన్న రెండు మేకలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... తాజాగా అధికారులు గొర్రెను అరెస్టు చేశారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... సుర్యాపేట జిల్లా చివ్వేంల మండలం సూర్యానాయక్ తండాలో హరితహారం మొక్కలు గొర్రెలు తిన్నాయి. మొక్కలను తిన్నందుకు గొర్రెలను అరెస్టు చేశారు. వాటిని విడిపించాలని వాటి యజమాని కోరడంతో...  యజమానికి పంచాయతీ కార్యదర్శి 1000 రూపాయలు పైన్ వేశారు. యజమాని పైన్ కట్టి గొర్రెలను తీసుకెళ్ళాడు.

పది రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో సేవ్ ద ట్రీ అనే స్వచ్ఛంద సంస్థ దాదాపు 980 మొక్కలను నాటారు. అందులో దాదాపు 250 మొక్కలు వరకు మేకలు తినేశాయి. ఇదే అంశానికి సంబంధించి మేకల యజమానులకు పలుసార్లు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో బుధవారం స్కూల్ ఆవరణలో మొక్కలను తింటున్న రెండు మేకాలను స్వచ్చంద సంస్థ సభ్యులు పోలీసులకు అప్పగించారు.

మేకల యజమానులు గగ్గోలు పెట్టడంతో... రూ.పదివేల జరిమానా విధించి వాటిని విడుదల చేయడం గమనార్హం. మేకలను అదుపు చేయాలని చాలా సార్లు చెప్పినా.. యజమానులు పట్టించుకోలేదని వారు చెబుతున్నారు. మేకల కారణంగానే మొక్కలు చనిపోయాయయని అందుకే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఏది ఏమైనా పోలీసులు మేకలను అరెస్టు చేయడం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేగింది.