సీమలో రాజధానిని ఏర్పాటు చేయడంతోపాటు కర్నూల్లో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక. నిధులు, నీళ్లు, ఉద్యోగాలతో ఇతర ప్రాంతాలతో సమానంగా చూడటం తో  పాటు ఈ ప్రాంత అభివృద్ధికి మరింత దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని గా కర్నూలు జిల్లా మూడు సంవత్సరాల పాటు కొనసాగిందని... అనంతరం అం తెలంగాణ తో కలయిక వలన ఆంధ్రప్రదేశ్‌గా అవతరించిందని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ కర్నూల్‌ని రాజధానిగా చేయాలన్న పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

తాజాగా ప్రభుత్వ తీరుతో తమలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి అని రాయలసీమకు మంచి రోజులురావడమే కాకుండా కర్నూలు జిల్లాకు ప్రాముఖ్యత పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం తిరిగి కర్నూలుని రాజధానిని చేస్తూ అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం గా జరపాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక డిమాండ్ చేసింది...