సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని ఓ పాత ఇనుము సామాను దుకాణంలో శుక్రవారం నాడు పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

సూర్యాపేట పట్టణంలోని  అయ్యప్ప ఆలయం సమీపంలోని పాత ఇనుము సామాను దుకాణం వద్ద  పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాంచందర్ అనే వ్యక్తి మృతి చెందాడు.

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సల్మాన్, సూర్యాపేట కు సమీంలోపి రాంకోటి తండాకు చెందిన  బుచ్చమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన  వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత ఇనుము సామాను దుకాణంలో పేలుడు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

"