కర్నూలు జిల్లా  మహానందిలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో మూడవరోజు చంద్రఘంట దుర్గాలంకారంలో చంద్రప్రభ వాహనం పై శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

3 వ రోజు ఆలయంలో కాలార్చన పూజలు, మూలమంత్రసహిత చండీ హోమాలు, రుద్ర మన్యు, గణపతి హోమాలు, నిత్య అనుష్ఠానములు, కూష్మాండ బలి, చతుర్వేద పారాయణలు.. నిర్వహించినట్లు ప్రధాన పూజారి రవిశంకర్ అవధాని తెలిపారు.

సాయంత్రం  అమ్మవారి కి దీపోత్సవం, దశవిధ హారతులు, వేదగామ సేవ,చంద్రగంట అలంకారం లో అమ్మవారి కి గ్రామోత్సవము, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించినట్లు తెలిపారు.