రోజా చేతుల మీదుగా హౌసింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం... కేశినేనికి అందని ఆహ్వానం
హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నేడు ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా చేతుల మీదుగా నిర్వహించే ఈ ప్రారంభోత్సవానికి మంత్రులు, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలను ఆహ్వానించారు.
టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లకు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలోని ది జవహర్ ఆటోనగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కన్స్యూమర్ కో ఆపరేటివ్ స్టోర్స్ కింద ఏపీఐఐసీ కాలనీలో ఆటోనగర్ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హౌసింగ్ కాంప్లెక్స్ ని త్వరలో ప్రారంభించనున్నారు. కాగా... ఈ ప్రారంభోత్సవానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లకు ఆహ్వానం అందలేదు.
హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నేడు ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా చేతుల మీదుగా నిర్వహించే ఈ ప్రారంభోత్సవానికి మంత్రులు, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలను ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ హౌసింగ్ కాంప్లెక్స్‌కు ఏపీఐఐసీ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఆరేళ్లు పనులు నిలిచిపోయాయి.
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రజాప్రతినిధులు కాంప్లెక్స్ సమస్యను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి నిధులు విడుదల చేయించారు. పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేయించారు. కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేసిన ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను ఆహ్వానించకపోవడంపై టీడీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి.