ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళపై ఇంటి యజమాని కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మల్కాజిగిరిలో చోటుచేసుకుంది. కాగా... ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో తీసి... దానిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించడం గమనార్హం. కాగా... బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని భర్తకు చెప్పింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు యజమాని శివప్రసాద్‌ను(36) బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు పిల్లలతో సహా మూడేళ్లుగా ఆనంద్‌ బాగ్‌కు చెందిన శివప్రసాద్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో శివప్రసాద్‌ ఆ మహిళను ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. ఈ నెల 12న ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యాచారం జరిపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.