నల్గొండ లో కుంభవృష్టి కురిసింది. మంగళవారం నల్గొండ పట్టణంలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దాదాపు ఆరు గంటలపాటు వర్షం ఏకధాటిగా కురిసింది. ఇంత ఏకధాటిగా వర్షం కురవడం  రికార్డు అని అధికారులు చెబుతున్నారు.

నల్గొండ పట్టణంలో 119 ఏళ్లలో ఇదే రికార్డ్‌ అని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రాత్రి 10.50 నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

ఈ భారీ వర్షం కారణంగా నల్గొండలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో.... ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు కూడా వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు.