నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డి ఎస్‌ఐ రివాల్వర్‌తో కాల్చుకొని బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బుధవారం నాడు పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు.
మృతుడికి కొడుకు, కూతురున్నారు. 

మరో 8 మాసాల్లో ప్రకాష్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సమయంలో ప్రకాష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టు‌మార్టమ్ నిర్వహించిన తర్వాత డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ప్రకాష్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాల విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.