కాకినాడ: ఆమె తల్లి లేని బిడ్డ. ఆమె బాగోగులు చూడాల్సిన తండ్రే ఆమెపై నీచానికి ఒడిగట్టాడు. సభ్య సమాజం తలదించుకునే ఘాతుకానికి పాల్పడ్డాడు. కామంతో కళ్లు మూసుకుపోయి వ్యవహరించాడు. కన్న కూతురిపై గత రెండేళ్లుగా ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. 

పోలీసులు అతన్ని అరెస్టు చేసి, అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలో ఆ ఘటన జిరింది. 14 ఏళ్ల బాలిక తల్లి మరణించడంతో హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. 

రెండేళ్ల క్రితం సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆమెపై తండ్రి అత్యాచారానికి దిగాడు. ఈసారి సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన ఆ బాలికపై ఆదివారంనాడు అతను అత్యాచారం చేశాడు. సోమవారం మరోసారి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. 

బాలిక ప్రతిఘటించి ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు 100కు ఫోన్ చేశారు. దాంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.