Asianet News TeluguAsianet News Telugu

టీటీడీ బోర్డులో క్రిమినల్స్, జగన్ పై రూ.100కోట్లు పరువు నష్టం దావా వేస్తాం: అచ్చెన్నాయుడు


పచ్చడైమండ్ పోయిందంటూ జగన్, వైసీపీ నేతలు పదేపదే చంద్రబాబుపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కానీ పచ్చ డైమాండ్ అనేది లేదని టీటీడీ జేఈవో ధర్మారెడ్డి స్వయంగా చెప్పారని నిలదీశారు. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 
 

ex minister atchannaidu serious comments on ap cm ys jagan
Author
Visakhapatnam, First Published Sep 28, 2019, 2:51 PM IST

విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఆరోపించారు. 

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందారని విమర్శించారు. మామూలుగా కాదు తీవ్రంగా వైఫల్యం చెందారంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. 

వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు అచ్చెన్నాయుడు. వైయస్ జగన్ ను విమర్శించిన వారిపై కేసులు పెడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తిట్టిపోశారు. 

ఇకపోతే వైయస్ జగన్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. టీటీడీ బోర్డులో క్రిమినల్స్ కి చోటు కల్పించారంటూ విమర్శించారు. గతంలో టీటీడీని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. 

డబ్బులు తీసుకుని టీటీడీ బోర్డులో అవకాశం ఇచ్చారంటూ వైయస్ జగన్ ఆరోపించారని అలాగగే టీటీడీలోని పచ్చ డైమండ్ ను చంద్రబాబు దొంగిలించారంటూ ఎన్నో తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇంటి పెరట్లో ఆ పచ్చడైమండ్ దొరుకుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 

ప్రపంచంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అపవిత్రం చేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. జంబో కేబినెట్ లా జంబో టీటీడీ బోర్డును నియమించారని విమర్శించారు. 

36 మంది సభ్యులకు అవకాశం కల్పించడం తప్పులేదు గానీ నిబంధనలకు విరుద్ధంగా క్రిమినల్స్ ను టీటీడీ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారని ఆరోపించారు. జగన్ కేసుల్లో, సీబీఐ కేసుల్లో, సంఘ విద్రోహ శక్తులుగా ముద్ర పడ్డ వ్యక్తులకు టీటీడీ బోర్డులో అవకాశం ఇచ్చి పెద్ద అపరాధం చేశారని తిట్టిపోశారు. 

శేఖర్ రెడ్డి వద్ద నారా లోకేష్ 100 కోట్లు తీసుకుని టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబులు పదేపదే ఆరోపించారని మరి ఇప్పుడు ఎన్నికోట్లు తీసుకుని అదే శేఖర్ రెడ్డికి అవకాశం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ అంశాలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆరోపించారు. 

రమణ దీక్షితులతో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి చంద్రబాబు నాయుడు గౌరవానికి మచ్చ తీసుకువచ్చారని ఆరోపించారు. చంద్రబాబు గౌరవానికి, తెలుగుదేశం పార్టీ క్రిమినల్స్‌ను పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.  

సీబీఐ కేసులు, నేరచరిత్ర కలిగిన ముద్దాయిలను టీటీడీ బోర్టు సభ్యులుగా నియమించారని విమర్శించారు. తిరుమల పవిత్రతను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. శేఖర్‌రెడ్డి దగ్గర లోకేష్ వంద కోట్లు తీసుకుని బోర్డు మెంబర్‌గా నియమించారని విజయసాయిరెడ్డి గతంలో ఆరోపించారని గుర్తుచేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఎన్ని కోట్లు తీసుకుని ఆయనను బోర్డు మెంబర్‌గా నియమించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

పచ్చడైమండ్ పోయిందంటూ జగన్, వైసీపీ నేతలు పదేపదే చంద్రబాబుపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కానీ పచ్చ డైమాండ్ అనేది లేదని టీటీడీ జేఈవో ధర్మారెడ్డి స్వయంగా చెప్పారని నిలదీశారు. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

పచ్చ డైమండ్‌ గురించి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వారిపై సుమోటాగా కేసు నమోదు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసినందుకు భక్తులకు, చంద్రబాబుకి జగన్ క్షమాపణ చెప్పాలని తెలిపారు. రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు అచ్చెన్నాయుడు.  

Follow Us:
Download App:
  • android
  • ios