జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకులను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు వినూత్నంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు.

150వ జయంతి కనుక 150మీటర్ల పొడవుగల జాతీయ పతకాన్ని తయారు చేసి... ఊరేగించారు. రాజు చౌక్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ ప్లకార్డులను ప్రదర్శించారు. గాంధీ సూక్తులను ప్రదర్శించారు. అనంతరం గాందీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 150మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది.