భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఏ చిన్న ఉద్రిక్తత చోటు చేసుకున్నా దాని ప్రభావం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త పాక్ క్రికెటర్ షోయాబ్ మాలిక్‌పై పడుతుంది. దేశం మొత్తం సర్జికల్ స్ట్రైక్స్, అభినందన్ వర్ధమాన్‌ల విషయంలో పాకిస్తాన్‌పై మండిపడుతున్న సమయంలో షోయాబ్ మాలిక్ ‘‘హమారా పాకిస్తాన్ జిందాబాద్’’ అంటూ ట్వీట్ చేశాడు.

దీంతో అతనిపై నెటిజన్లు రగిలిపోతున్నారు. హైదరాబాద్‌లో అడుగు పెడితే దేహశుద్ధి తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. వీరికి మద్ధతుగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలిచారు.

సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు. ‘‘ దేశం మొత్తం పాకిస్తాన్‌కు, టెర్రరిస్టులకు, పాక్ సైన్యానికి వ్యతిరేకంగా ఉంటే... మన బ్రాండ్ అంబాసిడర్ భర్త మాత్రం భారత్‌కు వ్యతిరేకంగా... పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నాడని రాజాసింగ్ మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలు ఏ మాత్రం సహించలేమని... సానియా స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌, సైనా నెహ్వాల్, పీవీ సింధులలో ఒకరిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని డిమాండ్ చేశారు.