Asianet News TeluguAsianet News Telugu

U-19 World Cup: జింబాబ్వే బౌలర్ కు ఐసీసీ షాక్.. మళ్లీ బౌలింగ్ వేయకుండా వేటు

ICC Uncer-19 World cup 2022:  జింబాబ్వే అండర్-19 జట్టులో కీలక బౌలర్ విక్టర్ చిర్వాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది.  ఇకపై అతడు బౌలింగ్  చేయడానికి వీల్లేకుండా ఆదేశాలు జారీ చేసింది. 
 

Zimbabwe Bowler Victor chirwa Suspended From Bowling In International Cricket For His Illegal Action
Author
Hyderabad, First Published Jan 20, 2022, 4:47 PM IST

జింబాబ్వే అండర్-19 క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు బౌలర్ విక్టర్ చిర్వాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. చిర్వా బౌలింగ్ యాక్షన్ అభ్యంతరకరంగా ఉండటంతో అతడి పై వేటు వేసింది. అండర్-19  ప్రపంచకప్ లో భాగంగా గత శనివారం పపువా న్యూ గినియాతో ముగిసిన  మ్యాచులో బౌలింగ్ వేసిన  చిర్వా.. బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని అండర్ -10 ఐసీసీ ప్యానెల్ నివేదికలో పేర్కొంది. దీంతో ఇందుకు సంబంధించిన ఫుటేజీని నిపుణుల బృందం పరిశీలించింది. 

చిర్వా బౌలింగ్ యాక్షన్ ను పరిశీలించిన ప్యానెల్ అధికారులు.. విక్టర్ అనుమానాస్పద రీతిలో బౌలింగ్ వేస్తున్నాడని నిర్ధారించింది.  ఐసీసీ రూల్స్ లోని ఆర్టికల్ 6.7 ప్రకారం.. చిర్వా బౌలింగ్ యాక్షన్ అభ్యంతరకరంగా ఉందని తేల్చింది. దీంతో అతడిపై ఐసీసీ వేటు వేసింది.

 

అంతర్జాతీయ క్రికెట్ లో అతడు మళ్లీ ఎప్పుడూ బౌలింగ్ వేయకుడా ఐసీసీ కఠిన ఆదేశాలు జారీ చేసింది.  ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఐసీసీ ప్యానెల్ తెలిపింది.  ఈ  మేరకు ఐసీసీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 

కాగా.. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు జింబాబ్వే రెండు మ్యాచులు ఆడింది. తొలుత పపువా న్యూ గినియా  తో జరిగిన మ్యాచ్ లో  228 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో  ఏడు ఓవర్లు వేసిన చిర్వా.. 11 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 

 

ఇక తర్వతి మ్యాచులో  పాకిస్థాన్ చేతిలో ఓడింది జింబాబ్వే.. జనవరి 17న జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన  పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేయగా.. 316 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్  కు దిగిన జింబాబ్వే  200 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో కూడా విక్టర్ చిర్వా   బౌలింగ్ వేశాడు. కానీ వికెట్లేమీ దక్కలేదు.  

Follow Us:
Download App:
  • android
  • ios