గతేడాది డిసెంబరులో ఓ ఇంటివాడైన టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీలు తాజాగా తమ వెడ్డింగ్ ఫిల్మ్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. సదరు వీడియోలో పెళ్లిలో నిర్వహించే పలు క్రతువులతోపాటు చాహల్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. 

గతేడాది డిసెంబరులో ఓ ఇంటివాడైన టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీలు తాజాగా తమ వెడ్డింగ్ ఫిల్మ్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

సదరు వీడియోలో పెళ్లిలో నిర్వహించే పలు క్రతువులతోపాటు చాహల్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. అలాగే, భార్యతో కలిసి ఫొటో షూట్‌‌లో పాల్గొన్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

ఈ స్నిప్పెట్‌‌ను షేర్ చేసిన చాహల్.. ‘‘ఇద్దరు ఉల్లాసవంతమైన, శక్తివంతమైన వ్యక్తులు కలిస్తే’’ అనే క్యాప్షన్‌ షేర్‌ చేయగా.. ధనశ్రీ ‘‘పెళ్లి తర్వాత జీవితం చాలా ప్రమాదకరంగా మారుతుంది భయ్యా’’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. 

ఇండియా, ఇంగ్లండ్ క్రికెటర్లు ఇటీవల పూణెకు వెళ్తున్న సమయంలో చాహల్, ధనశ్రీలు ఇద్దరూ కనిపించారు. ఇక, ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్.. ముంబై ఇండియన్స్‌తో జరిగే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌తో మైదానంలోకి దిగనున్నాడు.

గతేడాది ఐపీఎల్‌లో చాహల్ 15 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 99 ఐపీఎల్ మ్యాచుల్లో 121 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ 2020 లో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఈ లెగ్ స్పిన్నర్ 99 ఐపీఎల్ మ్యాచ్‌లలో 121 వికెట్లు తీశాడు. 

View post on Instagram