అంతర్జాతీయ కెరీర్‌లో 100 మ్యాచులు పూర్తి చేసుకున్న యజ్వేంద్ర చాహాల్...టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు...జస్ప్రిత్ బుమ్రాను దాటేసిన యజ్వేంద్ర చాహాల్...
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడినా, భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ ఖాతాలో ఓ రికార్డు చేరింది. నిన్న జరిగిన టీ20 మ్యాచ్, యజ్వేంద్ర చాహాల్‌కి అంతర్జాతీయంగా 100వ మ్యాచ్.
టీ20ల్లో టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్.46 టీ20 మ్యాచ్ ఆడిన యజ్వేంద్ర చాహాల్, జోస్ బట్లర్ వికెట్ తీసి టీ20 కెరీర్‌లో 60 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
ఇంతకుముందు జస్ప్రిత్ బుమ్రా 49 టీ20 మ్యాచుల్లో 59 వికెట్లు తీసి, టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉండేవాడు. అతన్ని అధిగమించిన చాహాల్, 60 వికెట్ల తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ 52, భువనేశ్వర్ కుమార్ 41 వికెట్లతో టాప్ 4లో ఉన్నారు.
