Asianet News TeluguAsianet News Telugu

చాహల్, కృష్ణప్ప గౌతమ్ లకు కూడా కరోనా పాజిటివ్..!

భారత క్రికెటర్లు చాహల్,కృష్ణప్ప గౌతమ్ లు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు.

Yuzvendra Chahal and K Gowtham  test positive for Covid-19
Author
Colombo, First Published Jul 30, 2021, 12:57 PM IST

భారత క్రికెటర్లు చాహల్,కృష్ణప్ప గౌతమ్ లు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. భారత స్క్వాడ్ లో కరోనా కలకలం వల్ల భారత్ శ్రీలంకతో జరిగిన రెండు టి20ల్లో కేవలం నలుగురు బ్యాట్స్ మెన్ తో మాత్రమే బరిలోకి దిగి ఓటమి చెందిన విషయం తెలిసిందే..! కృనాల్ పాండ్యతో పాటుగా మరో ఆరుగురు క్రికెటర్లు ఇసోలాటిన్ లో ఉన్న విషయం విదితమే. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు వారితోపాటే శ్రీలంకలో మరికొన్ని రోజులు ఉండనున్నారు. 

కృనాల్ పాండ్యా కరోనా బారిన పడడమే కాకుండా తనతో క్లోజ్ కాంటాక్ట్ అయిన 8మందిని జట్టుకి దూరం చేశాడు. జట్టుకి దూరమైన వారిలో పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దీపక్ చాహార్, యజ్వేంద్ర చాహాల్ వంటి స్టార్ ప్లేయర్లు ఉండడంతో టీమిండియాపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది.

ఆఖరికి రిజర్వు బెంచ్‌లో కూడా ప్లేయర్లు లేకపోవడంతో స్టాండ్ బై ప్లేయర్లను తీసుకుని ఆడాల్సి వచ్చింది. ఫలితం వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఓడి, టీ20 సిరీస్‌ను కోల్పోయింది టీమిండియా.మూడో టీ20లో అయితే 81 పరుగులు మాత్రమే చేయగలిగిన భారత జట్టు, 7 వికెట్ల తేడాతో లంక చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో భారత జట్టుకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన కృనాల్‌పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో బీభత్సమైన మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

ఇకపోతే.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్... కరోనా ప్రోటోకాల్ ప్రకారం 10 రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉండాల్సి ఉంటుంది... ఆ తర్వాత కరోనా నెగిటివ్ రిజల్ట్ వస్తే, ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్తారు...ఇండియా, శ్రీలంక దేశాల నుంచి వచ్చేవాళ్లను ఇంగ్లాండ్ బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత కూడా మరో 10 రోజులు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. అంటే 20 రోజుల పాటు ఈ ఇద్దరూ జట్టుకి అందుబాటులో ఉండరు.

ఈ ఇద్దరి స్థానంలో వేరే ప్లేయర్లను ఇంగ్లాండ్ టూర్‌కి పంపిస్తే, వాళ్లు 10 రోజుల క్వారంటైన్ తర్వాత జట్టుకి అందుబాటులో ఉంటారు. అందుకే టీమ్ మేనేజ్‌మెంట్, ఈ విధంగా ఆలోచనలు చేస్తోందట...ఇప్పటికిప్పుడు కొత్తవాళ్లను సెలక్ట్ చేసి, ఇంగ్లాండ్ టూర్‌కి పంపడం వీలుకాకపోవచ్చు. అయితే శ్రీలంక టూర్‌లో కృనాల్ పాండ్యాతో కలవని వారిలో ఉన్న భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ వంటి వాళ్లకి జట్టులో చోటు దక్కవచ్చు అని కూడా అంటున్నారు. 

‘మేం ఇప్పుడే ఏం చెప్పలేం. అయితే మరో రెండు రోజుల పాటు పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తాం. ఆ తర్వాత ఈ ఇద్దరి ప్లేస్‌లో రిప్లేస్‌మెంట్‌ తీసుకోవాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటాం...’ అని తెలిపారు ఓ బీసీసీఐ అధికారి...ఒకవేళ 20 రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న తర్వాత పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లను ఆడించాలని భావిస్తే... ఆఖరి రెండు టెస్టులకు మాత్రమే వీళ్లు అందుబాటులో ఉంటారు. ఈలోపు ఏ క్రికెటర్ గాయపడినా, జట్టు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు...

ఈ అన్ని కారణాల నేపథ్యంలో కరుణాళ్ పండుగా ఎంత పని చేసాడు అంటూ తలలు పట్టుకుంటున్నారు ఫ్యాన్స్..!

Follow Us:
Download App:
  • android
  • ios