Asianet News TeluguAsianet News Telugu

యువీ నయా ఇన్నింగ్స్ షురూ: ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్ లో ఆరంగేట్రం

ఆస్ట్రేలియాలో జరిగే ఈ దేశవాళీ టి20 టోర్నమెంట్‌ బీబీఎల్‌లో యువీ బ్యాట్ పట్టబోతున్నాడని సమాచారం. 

YUvraj Singh To feaature In BBL, Cricket Australia Busy Finding Him A Home
Author
Mumbai, First Published Sep 9, 2020, 10:37 AM IST

భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ కొత్త ఇన్నింగ్‌కు రెడీ అవుతున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాష్ లీగ్ లో యువీ కనిపించబోతున్నాడు. ఈ ఏడాదే ఆస్ట్రేలియాలో జరిగే ఈ దేశవాళీ టి20 టోర్నమెంట్‌ బీబీఎల్‌లో యువీ బ్యాట్ పట్టబోతున్నాడని సమాచారం. 

యూవీ గతేడాది క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈసారి యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌లోనూ ఆడటంలేదు. విదేశీ టీ 20 బిగ్ బాష్ లీగ్ లో 

ఆడే తొలి భారతీయ క్రికెటర్‌గా యూవీ రికార్డు సృష్టించనున్నాడు. ఎన్‌ఓసీ తీసుకున్నాక గతేడాది గ్లోబల్‌ టీ..20 కెనడా,అబుదాబీలో జరిగే టీ..10 లీగ్‌ మ్యాచుల్లో ఆడాడు. ఇక యూవీ కెనడా లీగ్‌లో టోరంటో టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినా విషయం తెలిసిందే. 

యువరాజ్‌సింగ్‌ మేనేజర్‌ మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డుతో కలిసి పని చేయనున్నట్టు సంకేతాలిచ్చారు. ఈ లీగ్‌కు సంబంధించి 10వ సీజన్‌ డిసెంబర్‌ మూడు నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకు జరుగుతుందని,  యువి అందులో ఆడనున్నాడని తెలిపాడు. 

017 జూన్‌ 30న వెస్టిండీస్‌తో భారత్‌ జరిగిన వన్డే మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ చివరగా ఆడాడు. ఆ తర్వాత 2018 ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున, 2019 ముంబయి ఇండియన్స్‌ జట్టులో ఆడాడు. అనంతరం యూవీ క్రికెట్‌ కి గుడ్ బై చెప్పాడు. 

బీబీఎల్‌లో ఇప్పటివరకూ భారతీయ క్రికెటర్లు ఆడలేదు. 2013..14లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆడనున్నార వార్తలు కూడా వచ్చాయి. సిడ్నీ థండర్ టీం మానేజ్మెంట్  సచిన్‌ ని అప్రోచ్‌ అయ్యారు కూడా. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios