Asianet News TeluguAsianet News Telugu

మొబైల్ ఫోన్స్ లేని కాలంలో... యూవీ త్రోబ్యాక్ ఫోటో వైరల్

ఆ కాలంలో కేవలం ల్యాండ్ ఫోన్స్ అందుబాటులో ఉండేవి. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉండేది అనే విషయాన్ని యూవీ సోషల్ మీడియాలో తన త్రో బ్యాక్ ఫోటోతో వివరించగా.. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.
 

Yuvraj Singh's "Throwback To Days Without Mobile Phones" Will Tickle Your Funny Bone
Author
Hyderabad, First Published May 25, 2020, 9:45 AM IST

ఇప్పడంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటోంది. ప్రపంచాన్ని అరచేతిలో చూసేస్తున్నారు. అయితే.. ఈ స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. అసలు మొబైల్ ఫోన్స్ కూడా లేని కాలం నుంచి మనమంతా వచ్చాం. ఆ కాలంలో కేవలం ల్యాండ్ ఫోన్స్ అందుబాటులో ఉండేవి. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉండేది అనే విషయాన్ని యూవీ సోషల్ మీడియాలో తన త్రో బ్యాక్ ఫోటోతో వివరించగా.. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.

 

విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో.. (  మొబైల్ ఫోన్స్ అందుబాటులో లేని రోజులు)ఆశిష్ నెహ్రా, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్ అప్పట్లో ఉన్న పేఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆ త్రో బ్యాక్ ఫోటోని తాజాగా యూవీ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాకుండా దానికి ఫన్నీగా ఓ క్యాప్షన్‌ని కూడా ఈ మాజీ ఆల్‌రౌండర్‌ జతచేశాడు.

‘‘ఓ పేలవ ప్రదర్శన తర్వాత మీ పేరెంట్స్ మీ మొబైల్ ఫోన్ బిల్లుని చెల్లించకపోతే.. మొబైల్ ఫోన్ లేని రోజుల్లో’’ అని ఇన్‌స్ట్రాగామ్‌లో యువరాజ్ సింగ్ రాసుకొచ్చాడు. ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఆ ఫొటోలోని నలుగురు క్రికెటర్లూ భారత క్రికెట్‌లో చెరగని ముద్రవేసినవారే. యువీ వరల్డ్‌కప్‌ల హీరోగా నిలవగా.. వీరేంద్ర సెహ్వాగ్ టెస్టుల్లో ట్రిఫుల్ సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇక వీవీఎస్ లక్ష్మణ్ కూడా తన మణికట్టు మాయాజాలంతో టెస్టు ఫార్మాట్‌లో ఆణిముత్యాల్లాంటి ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఆశిష్ నెహ్రా తన పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ.. ఈ నలుగురిలో నెహ్రాకి మాత్రమే గౌరవమైన వీడ్కోలు దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios