Shardul Thakur's Wedding: టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్  ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. రెండ్రోజుల క్రితం ముంబైలో అతడి వివాహం ఘనంగా  జరిగింది.  

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ రెండ్రోజుల క్రితం తన ప్రేయసి మిథాలీ పారుల్కర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను ఆడే క్రికెట్ షెడ్యూల్ ఏమీ లేకపోవడంతో శార్దూల్.. పారుల్కర్ తో పెళ్లి తదనంతర కార్యక్రమాలతో ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా తాజాగా శార్దూల్ క్లోజ్ ఫ్రెండ్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్.. అతడి భార్యకు కీలక సూచన చేశాడు. శార్దూల్ చాలా మొండోడని.. అతడి గర్వాన్ని అణచాలని మిథాలీకి సూచించాడు. 

శార్దూల్ పెళ్లి సందర్భంగా కేకేఆర్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో అభిషేక్ నాయర్ స్పందిస్తూ.. ‘నా తరఫున మిథాలీకి ఓ సూచన. నీకు ఈ విషయం తెలుసని నేను అనుకుంటున్నా. నువ్వు ఒక మొండి పట్టుదలగల వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నావ్.. 

నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. శార్దూల్ ఎప్పుడూ ‘నేనే కరెక్ట్’ అనుకుంటాడు. కానీ నాకు నీ గురించి కూడా తెలుసు మిథాలీ. నిన్ను నువ్వు చాలా నమ్ముతావు. ప్రతీ భార్య చేసినట్టుగానే నువ్వు కూడా చేయగలవన్న నమ్మకం నాకుంది. శార్దూల్ నీ ముందు తలవంచి ‘లేదు మిథాలీ నువ్వే రైట్.. నువ్వే రైట్’ అని బతిలాడుకోవాలి. ఆ రోజు కోసం నేను ఎదురుచూస్తుంటా..’అని ఫన్నీ అడ్వైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

Scroll to load tweet…

నాయర్ - శార్దూల్ లు మంచి స్నేహితులు. చాలాకాలంగా ఈ ఇద్దరూ కలిసి దేశవాళీలో ఆడారు. ప్రస్తుతం నాయర్ వయసు మీద పడటంతో ఆటకు దూరంగా ఉన్నాడు. అతడు కేకేఆర్ కు అసిస్టెంట్ కోచ్ గా పనిచేస్తున్నాడు. ఈ సీజన్ లో శార్దూల్ కూడా కేకేఆర్ తరఫునే ఆడుతుండటం గమనార్హం. 

 గత సీజన్ లో ఢిల్లీ శార్దూల్ ను రూ. 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసినా అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 14 మ్యాచ్ లలో 15 వికెట్లు మాత్రమే తీసిన శార్దూల్.. బ్యాటింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడిని ఢిల్లీ.. కేకేఆర్ కు ట్రేడ్ చేసింది. ఇక ఐపీఎల్ కంటే ముందు శార్దూల్.. ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ లో భాగం కానున్నాడు. మార్చి 17 నుంచి వన్డే సిరీస్ మొదలవుతుంది. మార్చి 19న రెండో వన్డే, 22న మూడో వన్డే జరగాల్సి ఉంది. ఇక ఈ నెల చివర్లో ఐపీఎల్ మొదలుకానుంది.

Scroll to load tweet…