జట్టును స్ట్రాంగ్ గా మార్చుకునే విధంగా జట్టును రూపొందించుకుంటామని చెప్పాడు. కొందరు ఆటగాళ్లు పరుగులు చేసేందుకు అవసరమైన ప్రదర్శన కనిపించలేదని.. కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ సిరీస్ లో.. ఇంగ్లాండ్ జట్టుకి విజయం దక్కింది. కాగా.. ఓటమిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. తమ జట్టులో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. బాగా ఆడకలిగే సరైన వ్యక్తులను జట్టుకోసం ఈ సారి ఎంపిక చేస్తామంటూ కోహ్లీ చెప్పడం విశేషం.
జట్టును స్ట్రాంగ్ గా మార్చుకునే విధంగా జట్టును రూపొందించుకుంటామని చెప్పాడు. కొందరు ఆటగాళ్లు పరుగులు చేసేందుకు అవసరమైన ప్రదర్శన కనిపించలేదని.. కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
నిన్నటి మ్యాచ్ లో సీనియర్ ఆటగాడు పూజారా తొలి ఇన్నింగ్స్ లో 84 బాల్స్ ఆడి కేవలం 54 పరుగులే చేశాడు. తొలి పరుగు చేయడానికి దాదాపు 35 బంతులు తీసుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ 80 బంతులు ఆడి కేవలం 15 పరుగులే చేయడం గమనార్హం. కనీసం మరో 30-40 పరుగులు చేసుంటే.. మ్యాచ్ డ్రా అయ్యి ఉండేది. దీంతో.. మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది.
దీనిపై కోహ్లీ మాట్లాడుతూ.. ఓటమి కారణాలను సమీక్షించుకుంటామని చెప్పాడు. ఎలాంటి బాల్స్ అయినా ఎదుర్కోనేవిధంగా.. ఎలాంటి వాతావరణంలోనైనా ఆడగలిగేవారినే ఈ సారి జట్టులోకి తీసుకుంటామని చెప్పాడు. అందుకు.. వెంటనే చర్యలు చేపడతామని చెప్పాడు. పరిమిత ఓవర్ల సమయంలో ఎలా ఆడతారో.. ఈసారి టెస్టు సిరీస్ లోనూ అదేవిధంగా ఆడేవారిని ఎంచుకుంటామని పేర్కొన్నాడు.
ఆట, పరిస్థితులపై తమకు మరింత అవగాహన అవసరమని.. బౌలర్లు మమ్మల్ని ఒత్తిడిలో నెట్టినా.. ధైర్యంగా ఆడాలని.. తొలిరోజులా మరీ స్వింగ్ అయితే తప్ప.. బౌలర్లు ఒకే ప్రాంతంలో బంతులు వేయకుండా అడ్డుకోవాలని కోహ్లీ పేర్కొన్నాడు.
