Asianet News TeluguAsianet News Telugu

ఫైనల్సా..? ప్లే ఆఫ్సా..? ఆర్సీబీతో కీలక మ్యాచ్ లో తేలనున్న ముంబై భవితవ్యం.. తొలిసారి టాస్ గెలిచిన హర్మన్

WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  భాగంగా  నేడు ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నడుమ   కీలక మ్యాచ్ జరుగనుంది.  ఈ మ్యాచ్ లో గెలిస్తేనే  ముంబై.. ఫైనల్ చేరుకుంటుంది. 

WPL 2023:  Mumbai Indians Eyes on Top Place, Won The Toss and opts Bowl First vs RCB MSV
Author
First Published Mar 21, 2023, 3:04 PM IST

వరుసగా ఐదు మ్యాచ్ లలో గెలిచి తర్వాత రెండింటిలో  ఓడిన జట్టు ఓ వైపు..  ఆడిన ఐదు మ్యాచ్ లలో ఓడి తర్వాత రెండింటిలో గెలిచిన జట్టు మరో  వైపు..  ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య కీలక మ్యాచ్  జరుగబోతుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా  ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లు  లీగ్ దశలో తమ చివరి   మ్యాచ్ ఆడనున్నాయి.  నేటి మ్యాచ్ లో  హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్  టాస్ గెలిచి తొలుత బౌలింగ్ కు రానుంది. ఆర్సీబీ బ్యాటింగ్   చేయనుంది. కాగా  ఈ సీజన్ లో హర్మన్ సేన  తొలిసారి టాస్ గెలిచింది. 

ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా ఆర్సీబీకి వచ్చిన నష్టమేమీ లేదు గానీ  ముంబైకి మాత్రం  చాలా కీలకం.  వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిన ఆ జట్టు   నేటి మ్యాచ్ లో గెలిస్తేనే  ఫైనల్ చేరుతుంది. అది కూడా భారీ స్థాయిలో గెలవాలి. 

నిబంధనలు ఇవి.. 

- డబ్ల్యూపీఎల్ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో  నెంబర్ వన్ స్థానంలో ఉన్న జట్టు  నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.  
- రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు  ఎలిమినేటర్ (ప్లేఆఫ్స్) ఆడతాయి. 
- అంటే  ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం.. ఢిల్లీ నేరుగా ఫైనల్ (?) చేరితే   యూపీ వారియర్స్ తో కలిసి ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. 

నేరుగా ఫైనల్ కు వెళ్లేందుకు ఓ ఛాన్స్ ఉంది.. 

- ముంబై ఫైనల్ చేరాలంటే  ఆర్సీబీతో ఆడబోయే మ్యాచ్ ముంబైకి కీలకం. ఈ మ్యాచ్ లో బెంగళూరును భారీ తేడాతో ఓడిస్తే అప్పుడు ఆ జట్టు నెట్ రన్ రేట్ పెరుగుతుంది.  ఇదే క్రమంలో ఢిల్లీ కూడా..  నేటి సాయంత్రం యూపీ వారియర్స్ తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో యూపీ గనక  ఢిల్లీని చిత్తుగా ఓడిస్తే అప్పుడు  ముంబై  మళ్లీ మొదటి  స్థానానికి వెళ్లనుంది.  అలా జరిగితే ముంబై.. నేరుగా ఫైనల్ ఆడొచ్చు. లేదంటే ప్లేఆఫ్స్ లో గెలిచి  ఫైనల్ కు వెళ్లాల్సి ఉంటుంది. 

తుది జట్లు : 

ఆర్సీబీ :  స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, హెథర్ నైట్, రిచా ఘోష్, కనిక అహుజా, శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోభన, ప్రీతి బోస్ 

ముంబై : హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నటాలీ సీవర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమెలియా కెర్, పూజా వస్త్రకార్, ఇస్సీ వాంగ్,  అమన్‌జ్యోత్ కౌర్,   హుమైర కాజి, జింతమణి కలిత, సైకా ఇషాక్ 

Follow Us:
Download App:
  • android
  • ios