విండీస్ మాజీ క్రికెటర్, మాజీ పేసర్ ఇజ్రా మోస్లీకి రోడ్డు ప్రమాదం...ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన మోస్లీ...విండీస్ రెబల్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న ఇజ్రా మోస్లీ...

ఆదివారం బంగ్లాదేశ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో రికార్డు లక్ష్యాన్ని చేధించిన వెస్టిండీస్ జట్టుకు ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. విండీస్ మాజీ క్రికెటర్, మాజీ పేసర్ ఇజ్రా మోస్లీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 63 ఏళ్ల మోస్లే... బ్రిడ్జిటౌన్‌‌లో నివాసం ఉంటున్నారు.

శనివారం తన సైకిల్‌పై వెళ్తుండగా... వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆయన్ని ఢీకొట్టింది. ఈ కారును ఓ టీనేజర్ నడపడం విశేషం. 1990 నుంచి 1991 దాకా విండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఇజ్రా మోస్లీ రెండు టెస్టుల్ల ఆరు వికెట్లు, తొమ్మిది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు.

2016లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్ జట్టుకి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహారించాడు ఇజ్రా మోస్లీ. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుపై నిషేధం ఉన్న సమయంలో అక్కడ పర్యటించిన విండీస్ రెబల్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న ఇజ్రా మోస్లీపై నిషేధం పడింది. 32 ఏళ్ల బ్యాన్ నుంచి బయటపడి, విండీస్‌కి ఆడాడు మోస్లీ.