Asianet News TeluguAsianet News Telugu

Ajinkya Rahane: మనం కోల్కతా వెళ్తాం.. ప్లేఆఫ్స్ ఆడతాం.. రహానే భావోద్వేగ వ్యాఖ్యలు..

IPL 2022 Play Offs: గత ఐపీఎల్ లో రన్నరప్ గా నిలిచి ఈ ఏడాది  వరుస పరాజయాలో ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు సంక్లిష్టం చేసుకున్న కోల్కతా నైట్ రైడర్స్.. తర్వాత మ్యాచ్ లో గెలవడంతో పాటు ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. 

We will Go To Kolkata: Ajinkya Rahane Backs to Qualify IPL 2022 Play Offs
Author
India, First Published May 17, 2022, 6:20 PM IST

కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు అజింక్యా రహానే.. బబుల్ నుంచి వెళ్తూ వెళ్తూ  కేకేఆర్ ప్లేయర్లకు బూస్ట్ ఇచ్చే స్పీచ్ చెప్పి వెళ్లాడు.  ఇటీవలే సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన గాయంలో  రహానే కు గాయమైన విషయం తెలిసిందే. కండరాల గాయంతో అతడు నాలుగు వారాల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాలని వైద్యులు తేల్చడంతో రహానే.. ఐపీఎల్ బయో బబుల్ నుంచి బయటకు వెళ్లాడు. ఈ సందర్భంగా రహానే.. తన జట్టు సభ్యులలో ఆత్మ విశ్వాసాన్ని నూరి పోశాడు. తమ జట్టు కచ్చితంగా కోల్కతాకు వెళ్తుందని..  కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరుకుంటుందని చెప్పాడు. 

రహానే మాట్లాడుతూ.. ‘కేకేఆర్ లో నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆన్ ఫీల్డ్ తో పాటు ఆఫ్ పీల్డ్ లో ఇక్కడున్న ప్రతి ఒక్క ఆటగాడితో నాకు మంచి అనుబంధముంది. మీ అందరి నుంచి క్రికెట్ గురించే గాక జీవితం గురించి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను.. 

మన జట్టు ఆటగాళ్లందరికీ  నేను కృతజ్ఞతలు చెబుతున్నాను.   అలాగే కేకేఆర్ సిబ్బంది, వెంకీ సార్ (కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్) మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు.  మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను వచ్చే ఏడాది  మరింత రెట్టించిన ఉత్సాహంతో తిరిగివస్తాను.  మనం తర్వాత ఆడబోయే మ్యాచ్ లో కచ్చితంగా గెలిచి  కోల్కతా కు (తొలి ప్లేఆఫ్స్ జరిగేది అక్కడే) వెళ్తామని నాకు విశ్వాసముంది. అందరికీ థ్యాంక్యూ..’ అని తెలిపాడు.  ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్.. తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

 

తన జట్టుపై రహానేకు అచంచల  విశ్వాసం ఉన్నా ఆ జట్టు ప్లేఆఫ్ చేరడమనేది అంత సులువైన విషయం కాదు. దానికి కేకేఆర్.. తర్వాత ఆడబోయే లక్నో సూపర్ జెయింట్స్ తో గెలిస్తేనే సరిపోదు. భారీ తేడాతో లక్నోను ఓడించడమే గాక మిగతా జట్ల జయాజయాలు, ఇతర సమీకరణాలు కూడా అందులో ఇమిడిఉన్నాయి. ఈ సీజన్ లో 13 మ్యాచులాడిన సీఎస్కే.. ఆరింటిలో గెలిచి ఏడు మ్యాచుల్లో ఓడింది. 

 ప్రస్తుతం 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న కేకేఆర్ కు ఇంకా ఒకటే మ్యాచ్ మిగిలుంది.  కానీ ఇప్పటికే నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. దాదాపు ప్లేఆఫ్ అవకాశాలను చేజిక్కించుకున్నట్టే కనిపిస్తున్నది. ఐదో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. తన తర్వాత మ్యాచ్ లో గుజరాత్ తో భారీ తేడాతో నెగ్గితేనే ఆ జట్టుకు కూడా అవకాశాలుంటాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios