ఎక్కువగా యువకులతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మంచి ఫాలోయింగ్ ఉంది. గత ఏడాది అంచనాలకు మించి రాణించిన ఢిల్లీ, ప్లే ఆఫ్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఈసారి ఐపీఎల్ రికార్డులన్నీ తిరగరాసి, టైటిల్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు డీసీ క్యాప్టెన్ శ్రేయాస్ అయ్యర్. 

‘సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ వంటి ఇద్దరు మేధావులు మా జట్టుకు తోడుగా ఉన్నారు. ఆ ఇద్దరి వల్లే కెప్టెన్‌గా నాపై ఒత్తిడి ఏ మాత్రం లేదు. ఏడాదిగా భారత జట్టుకు కూడా ఆడుతున్నా. ఆ ఆత్మవిశ్వాసంతో ఈసారి ఐపీఎల్‌లో మ్యాజిక్ చేయాలనుకుంటున్నా.

పృథ్వీషా, రిషబ్ పంత్, రబాడా వంటి యంగ్ ప్లేయర్లతో పాటు ధావన్, అశ్విన్, రహానే, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా వంటి సీనియర్లు కూడా జట్టులో ఉన్నారు... ఈసారి అభిమానులను నిరాశ పరచకుండా ఆడతాం...’ అన్నాడు శ్రేయాస్ అయ్యర్.

రాజస్థాన్ నుంచి వచ్చిన అజింకా రహానే, పంజాబ్ నుంచి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్‌ ఢిల్లీకి అదనపు కాబోతున్నారు. వీరితో పాటు కీమో పాల్, హెట్మయర్, అలెక్స్ క్యారీ, స్టోయినిస్ వంటి విదేశీ స్టార్లు కూడా ఢిల్లీ జట్టులో ఉన్నారు.