రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భార్య  ధన శ్రీ వర్మ మరోసారి ఆర్సీబీ అభిమానులను అలరించారు. మొన్నటి వరకు ఐపీఎల్ మ్యాచ్ ల సమయంలో... అభిమానులను, తమ జట్టును ఉత్సాహపరిచేందుకు ఆమె తన వంతు ప్రయత్నం చేసేవారు. అయితే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్ రద్దు అయిపోయింది. దీంతో.. క్రికెటర్లంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

అయితే.. ఈ సారి ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టు చాలా బాగా ఆడింది. ఆర్సీబీ అభిమానులు సైతం ఈసారి కప్పు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా సీజన్ రద్దు కావడం వారిని బాగా కలచివేసింది. ఈ నేపథ్యంలో.. ధనశ్రీ వర్మ ఆర్సీబీ అభిమానులను తన స్టెప్పులతో అలరించారు.

 

ఆర్సీబీ జెర్సీ ధరించి..  అమెరికన్ ర్యాపర్ సౌల్జా బాయ్స్ ఫేమస్ సాంగ్ ‘ షీ మేక్ ఇట్ క్లాప్’ అనే పాటకు స్టెప్పులు వేశారు. ఆమె డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎక్కువగా ఆమె ఆర్సీబీ జెర్సీ ధరించడం.. అభిమానులు ఎక్కువగా ఇంప్రెస్ చేస్తుండటం గమనార్హం.

ఆ వీడియో షేర్ చేసిన నాలుగు గంటల్లోనే 2లక్షల వ్యూస్ రావడం గమనార్హం. ఈ వీడియో అప్ లోడ్ చేసిన ధనశ్రీ.... క్యాప్షన్ లో స్టే సేఫ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు.