టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. తన భార్య నటాషాను బాగా మిస్ అవుతున్నాడనిపిస్తోంది. హార్దిక్.. ఐపీఎల్ 2020 కోసం ఇటీవల దుబాయి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో... భార్య నటాషా.. తన ముద్దుల కుమారుడికి దూరమయ్యాడు. ఆ విషయాన్ని ఇటీవల ఓ పోస్టు ద్వారా తెలియజేసిన హార్దిక్.. తాజాగా.. మరో పోస్టు షేర్ చేశాడు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Watch-u lookin at? 😎

A post shared by Hardik Pandya (@hardikpandya93) on Aug 27, 2020 at 12:39am PDT

గతంలో నటాషాతో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేశాడు. అందులో ఇద్దరూ కారులో కూర్చొని ఉన్నారు. కాగా.. ఆ ఫోటోలో తాను పెట్టుకున్న గడియారాన్ని గుర్తు చేస్తూ.. నటాషాని ట్యాగ్ చేసి ఈ ఫోటో షేర్ చేశాడు.  కాగా.. దానికి నటాషా కూడా స్పందించింది. హగ్, లవ్ ఎమోజీని రిప్లైగా ఇచ్చింది. కాగా.. నటాషా జులై 30వ తేదీన పండంటి బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సెర్బియన్ నటి నటాషాతో హార్డిక్ పాండ్యా ఈ ఏడాది జనవరి 1న నిశ్చితార్థమైంది. ఈ నేపథ్యంలో మే 31న తాను తండ్రిని కాబోతున్నట్లు పాండ్యా ప్రకటించాడు.

ఇదిలా ఉండగా.. ఇటీవల హార్దిక్.. తన భార్య నటాషా స్టాంకోవిక్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను పాండ్యా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

అయితే ఇది తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఇన్‌‌స్టా తొలగిచించింది. అయితే మంగళవారం నటాషా మళ్లీ అదే ఫోటోను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. కానీ ఈసారి ఈ చిత్రాన్ని ఇన్‌స్టా తొలగించలేదు.

మొదటి సారి షేర్ చేసిన ఫోటో స్థానంలో మీ చిత్రం తమ కమ్యూనిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి మీ పోస్ట్‌ను తొలగించాల్సి వచ్చిందని మెసేజ్ కనిపిస్తోంది.

మొదట పెట్టిన ఫోటోకు మిస్సింగ్ యూ హార్దిక్ పాండ్యా అనే క్యాప్షన్ పెట్టగా.. రెండవసారి పెట్టిన పోస్ట్‌కు నటాషా ఎలాంటి శీర్షికను తగిలించలేదు. మరోవైపు ఆ ఫోటోకు ‘‘హా హా ఐ లవ్ యూ’’ అని హార్దిక్ కామెంట్ పెట్టాడు.